GV బయోగ్రఫీ

పేద ప్రజలకు ఏదో చెయ్యాలన్న తపన, వారి అభివృద్ధికి తనవంతు కృషి చెయ్యాలన్న మంచి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చారు వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు. 2009లో టీడీపీ తరపున వినుకొండ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. మొదటి ప్రయత్నంలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. జీవీ ఆంజనేయులు చేసిన అభివృద్ధి పనులు వినుకొండ నియోజకవర్గ ప్రజలకు బాగా నచ్చాయి. దీంతో.. ఆయన్ను 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. ఇప్పుడు మూడోసారి కూడా గెలిపించుకుని ఆయనకు హ్యాట్రిక్ ఇచ్చేందుకు వినుకొండ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.

జీవీ ఆంజనేయులు అసలు పేరు గోనుగుంట్ల వీరాంజనేయులు. రాజకీయాలు వల్ల ప్రజలు బాగుపడాలి అనేదే ఆయన లక్ష్యం. అందుకే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కేవలం వినుకొండ నియోజకవర్గ అభివృద్ధి పైనే దృష్టిపెట్టారు. వినుకొండ నియోజకవర్గ చరిత్రలోనే మరో ఎమ్మెల్యే చెయ్యని విధంగా అభివృద్ధి చేసి చూపించారు

  జీవీ హయాంలో జరిగిన అభివృద్ధి పనులు

 1. రూ.2000 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు
 2. రూ.180 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం
 3. రూ.79 కోట్లతో కాలువల ఆధునికీకరణ
 4. రూ. 25 కోట్లతో 250 స్మశాన వాటికలు
 5. రూ. 56.84 కోట్లతో ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కింద అభివృద్ధి పనులు
 6. రూ. 35,300 మందికి కంటిచూపు ఆపరేషన్లు
 7. రూ.3.5 కోట్లతో 86 వేలమందికి కళ్లజోళ్లు
 8. రూ. 5.74 కోట్లతో 25వేల మంది విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్
 9. రూ. 1.2 కోట్లతో నియోజక వర్గంలో సిమెంట్ బల్లలు ఏర్పాటు
 10. రూ. 57 లక్షలతో 192 మంచినీటి బోర్లు
 11. రూ. 420 మంది వికలాంగులకు చేయూత

శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్

అధికారంలో ఉన్నా లేకపోయినా, పదవిలో ఉన్నా లేకపోయినా.. ఎదుటివారికి ఎప్పుడు సాయం చేయాలనే తలంపుతో శివశక్తి లీలా అంజన్ ఫౌండేషన్ని ఏర్పాటు చేశారు జీవీ ఆంజనేయులు. నిరంతర శ్రామికుడు, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ గారి ఆలోచనలను ప్రేరణగా తీసుకుని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఫౌండేషన్ ద్వారా అనాథలకు సాయం చేయడం, వృద్ధులకు కంటి ఆపరేషన్లు, ఉచిత మందుల పంపిణి కార్యక్రమం, ఉచిత కళ్లజోళ్ల పంపిణి, హెల్త్ క్యాంప్స్ నిర్వహణ లాంటి మంచి కార్యక్రమాలను చేస్తున్నారు.

వ్యాపార రంగంలోనూ సాటి లేని మేటి

రాజకీయాలతో పాటు వ్యాపర రంగంలోనూ రాణిస్తున్నారు జీవీ ఆంజనేయులు. 1996లో శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ని ఏర్పాటు చేశారు. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్, మైక్రోన్యూట్రియంట్స్, బయో పెస్టిసైడ్, బయో ఫెర్టిలైజర్స్ని ఈ కంపెనీ తయారు చేస్తుంది. ఈ మధ్యనే శివశక్తి గ్రూప్ టేక్ ప్లాంట్ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టింది. ఈ గ్రూప్ ద్వారా దాదాపు 7000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వ్యాపార రంగంలో అద్భుత ప్రతిభకు జీవీ ఆంజనేయులు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు గెల్చుకున్నారు.

ఫ్యాప్సీ హైదరాబాద్ వారి “బెస్ట్ మార్కెటింగ్ ఎఫర్ట్ అవార్డ్” 2000-2001

ఫ్యాప్సీ హైదరాబాద్ వారి “బెస్ట్ ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీ అవార్డ్” 2002-2003

ఫ్యాప్సీ హైదరాబాద్ వారి “బెస్ట్ మార్కెటింగ్ పర్ఫార్మెన్స్ అవార్డ్” 2003-2004

12వ ఆసియా పసిఫిక్ హెచ్‌ఆర్‌ఎమ్ కాంగ్రెస్‌ వారి “ఆర్గనైజేషన్‌ విత్ ఇన్నోవేటివ్‌ హెచ్‌ఆర్‌ ప్రాక్టీసెస్” 2011-12

ఫిక్కి ఫుడ్ 360 వారి “బెస్ట్‌ మార్కెటింగ్‌ కంపెనీ” అవార్డ్ 2011-12

ఇండియన్‌ హ్యూమన్‌ క్యాపిటల్‌ అవార్డ్స్‌ వారి “బెస్ట్‌ లెర్నింగ్‌ అండ్‌ డెవలెప్‌మెంట్‌ స్ట్రాటజీ” 7వ ఎంప్లాయర్‌ బ్రాండ్‌ వారి “ఎక్స్‌ లెన్స్‌ ఇన్ ట్రైనింగ్‌ అండ్‌ బెస్ట్‌ హెచ్‌ఆ్‌ స్ట్రాటజీ ఇన్‌ లైన్‌ విత్ బిజినెస్ అవార్డ్”

అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ విభాగంలో “టీవీ5 -–బిజినెస్ లీడర్‌ అవార్డ్” 2012

మరిన్ని వివరాలకు..

https://en.wikipedia.org/wiki/Gonuguntla_Venkata_Seeta_Rama_Anjaneyulu

వీడియోలు

మీకు డబ్బులే ముఖ్యమా, ప్రజల ఆరోగ్యం ఏమైపోయినా పట్టదా?

2013లో వెల్లలచెరువు ఫ్యాక్టరీ నుంచి సరఫరా అయిన పాలు కల్తీ అని నిర్ధారణ అయ్యింది. స్టేట్ ల్యాబ్, సెంట్రల్ ల్యాబ్లో చెక్ చేసినా కూడా అవి కల్తీ పాలే అని తేల్చారు. అందువల్లే అప్పుడు వెల్లలచెరువు ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఇద్దరు ఉద్యోగులకు రూ.లక్ష జరిమానాతో పాటు 3 నెలల జైలు శిక్ష విధించారు. కానీ ఆ ఫ్యాక్టరీకి ఎండీగా ఉన్న బొల్లా బ్రహ్మనాయుడు మాత్రం అధికారులకు డబ్బులిచ్చి తప్పించుకున్నారు. అక్రమాలతో డబ్బులు సంపాదించుకుని మీకింద పనిచేసే వారికి కేసుల్లో ఇరికించారు. మీకు డబ్బులే ముఖ్యమా? ప్రజల ఆరోగ్యం ఏమైపోయినా మీకు పట్టదా? ఇప్పుడు వల్లభ ఫ్యాక్టరీలో కూడా ఇదే జరుగుతోంది. కల్తీ పాలు అమ్మి అప్పుడు దొరికిపోయిన రామినేని శ్రీనివాసరావు.. ఇప్పుడు వలభ ఫ్యాక్టరీని డైరెక్టర్గా ఉన్నారనే విషయం మీకు తెలియదా.? అని నేను బొల్లా బ్రహ్మానాయుడ్ని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ప్రజల అరోగ్యంతో చెలగాటమాడితే ప్రభుత్వం ఊరుకోదని ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. #VNKwithGVA #APwithCBN #NCBN #GVAnjaneyulu #TDP #AndhraPradesh

Posted by GV Anjaneyulu on Monday, February 25, 2019

వార్తలు

వినుకొండ నియోజకవర్గ ప్రజలకు ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మనలో సగం అయిన మహిళను ప్రతీ ఒక్కరూ కచ్చితంగా గౌరవించాలి. పురుషులతో సమానంగా అవకాశాలు కల్పించాలి...

ఓటమి భయంతోనే వైసీపీ అక్రమాలకు పాల్పడుతుంది. టీడీపీని ధైర్యంగా ఎదుర్కున్న దమ్ము లేక లేనిపోని ఆరోపణలు చేస్తోంది. అందుకే సేవామిత్ర యూప్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు...

మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని బొల్లాపల్లి మండలం మన్నెపల్లి తండలా మన్నెల పల్లయ్య స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఈ సందర్బంగా స్వామివారి పూజలో పాల్గొన్ని తీర్థ ప్రసాదాలు స్వీకరించాను...

వినుకొండ నియోజకవర్గ పరిథిలోని గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని చూసి రామలింగాపురం గ్రామంలో 150 మంది వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆత్మీయంగా ఆహ్వానించడం జరిగింది. చంద్రబాబు గారి...

వినుకొండ నియోజకవర్గంతో పాటు నియోజకవర్గ పరిథిలో ఉన్న అన్ని గ్రామాల్లో నేను చేస్తున్న అభివృద్ధిని చూసి శావల్యాపురం మండలం లోని శానంపూడి ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీ వాసులతో పాటు కొత్తూరుకు చెందిన పలు కుటుంబాల వారు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆత్మీయంగా...

నాలుగున్నరేళ్లలో 138 అవార్డులు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యుత్ రంగానికి మరో అవార్డు సొంతమైంది. ప్రతి ఏటా విద్య, శిక్షణ, పరిశోధన, సాంకేతిక వినియోగం, పని ప్రదేశాలలో రక్షణ విధానాలు, పర్యావరణ పరిరక్షణ విషయాలలో దేశవ్యాప్త సంస్థలను ప్రోత్సహించే విధంగా అవార్డులను ఇస్తోంది ఢిల్లీలోని గ్రీన్ టెక్ ఫౌండేషన్ సంస్థ...

twitter

సాంఘిక ప్రసార మాధ్యమం

మరింత సమాచారం

GV Anjaneyulu, MLA
D.NO: 29-377, Kothapeta,
4rth ward, Vinukonda,
Guntur District, AP. 522647